SRCL: వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలో వెలసిన గ్రామ దేవత శ్రీ దుబ్బ రాజన్న స్వామి జాతర పోస్టర్ను వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈవో రమాదేవి చేతులమీదుగా ఘనంగా ఆవిష్కరించారు. ఈ నెల 17, 18 తేదీలలో భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్న జాతర సందర్భంగా గ్రామస్తులు, జాతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.