SRCL: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండల అధ్యక్షులు మొకిలే విజేందర్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వోకు వినతి పత్రం సోమవారం అందజేశారు. మండల రెవెన్యూ అధికారిగా మీ పరిధిలోని ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.