SRD: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ మీటర్ బిల్డింగ్ ఉద్యోగులు చలో హైదరాబాద్కు సదాశివపేట పట్టణం నుంచి సోమవారం భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. వారు మాట్లాడుతూ.. 25 సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నా కనీస వేతనాలు అమలు కావడం లేదని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసమే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.