KMM: పాలేరు నియోజకవర్గంలో కూసుమంచి మండలం, నరసింహులగూడెం మండలంలోని మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో మంగళవారం షూ పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచనల మేరకు పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొన్ని విద్యార్థులకు స్వయంగా షూస్ అందజేశారు.