GDWL: పట్టణంలోని పిల్లిగుండ్ల శ్రీ ముడువుల ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల 21న నిర్వహించనున్న ఆది శంకరాచార్య జయంతి ఉత్సవాలకు హాజరుకావాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని వేద బ్రాహ్మణులు కోరారు. బుధవారం గద్వాల క్యాంపు కార్యాలయంలో ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఇందులో ప్రధాన అర్చకులు సాగర్ స్వామి కూడా ఉన్నారు.