RR: కార్మికుల హక్కుల పోరాటమే లక్ష్యంగా హైదర్‌నగర్ డివిజన్ రామ్ నరేష్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన టీపీసీసీ లేబర్ సెల్, ఐఎన్టీయూసీ కార్యాలయాన్ని జగదీశ్వర్ గౌడ్ ముఖ్య అతిథులతో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.