JGL: పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలను ఎలాంటి భయం లేకుండా, స్వేచ్ఛగా రాయాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా సూచించారు. సోమవారం రాయికల్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మోటివేషనల్ & గైడెన్స్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు లైవ్ టెలికాస్ట్ ద్వారా ఆమెను వీక్షించారు. ఇందులో హెచ్ఎం కాపు శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.