MNCL: జిల్లెడ గ్రామంలో ఆదివాసీల కాలనీలో త్రాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం అధ్యక్షులు భాగాల రాజన్న అధికారులపై మండిపడ్డారు. నీటిని కొనుక్కొని తాగుతున్నారు, నీళ్ళ కోసం అల్లాడిపోతున్న, అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని అన్నారు. వెంటనే త్రాగునీరు అందించే విధంగా చూడాలని అధికారులను కోరారు.