HYD: ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానా విధిస్తామంటూ గత కొద్దిరోజులుగా జూబ్లీహిల్స్ సర్కిల్ 18 పరిధిలోని సింగాడబస్తీ, ఇందిరానగర్లో GHMC అధికారులు స్థానికంగా ఉండే మహిళా సమాఖ్యలతో కలిసి చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతున్నాయి. జరిమానాలకు భయపడి ఇప్పుడు ఎవరూ కూడా బయట వేయడం లేదు. చెత్త సేకరించే వాహనాలకే బస్తీ వాసులు మొగ్గు చూపుతున్నారని అధికారులు తెలిపారు.