జనగామ: దేశంలో సామాన్య ప్రజలపై మారణహోమం సృష్టిస్తున్న ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి అన్నారు. దానికి సీపీఐ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. రఘునాథపల్లి మండలం కంచనపల్లిలో జరిగిన సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. మరో సారి ఇలా జరగకుండా ఉండేలా వారికి బుద్ధి చెప్పాలన్నారు.