AP: అనర్హులకు సదరం ధ్రువీకరణ పత్రాలు జారీ కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు. ’70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ పీఎంజేఏవై వయో వందన పథకం కింద రూ.5 లక్షల ఉచిత వైద్యం అందిస్తాం. ఈ పథకం వర్తింపునకు ఎలాంటి సామాజిక, ఆర్థిక నిబంధనలు లేవు. రాష్ట్రంలో 25 లక్షల మంది ఈ పథకానికి అర్హులు ఉంటారని అంచనా వేస్తున్నాం’ అని వెల్లడించారు.