NLR: రంగనాయకులపేట రైల్వే గేట్ వద్ద గ్రీన్ మ్యాట్ పందిరి ఏర్పాటు చేశారు. నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ నందన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రైల్వే గేట్లు వేసిన సమయంలో ప్రజలు ఎక్కువసేపు ఎండలో వేచి ఉన్నప్పుడు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తొలుత రంగనాయకులపేట రైల్వే గేట్ వద్ద పందిరి ఏర్పాటు చేశారు.