SRD: అంగన్వాడీ టీచర్లకు ఫోక్సో చట్టంపై అవగాహన ఉండాలని అదనపు ఎస్పీ సంజీవరావు అన్నారు. జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో భరోసా కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 18 సంవత్సరాలలోపు బాలికలపై లైంగిక దాడులు జరిగితే ఫోక్సో కేసుగా నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలితకుమారి, హనుమంతు, డీసీపీవో రత్నం పాల్గొన్నారు.