W.G: తణుకు పురపాలక సంఘం పరిధిలోని 29, 32వ వార్డులలో రోడ్డు విస్తరణకు సంబంధించి స్థానికుల నుంచి అభ్యంతరాలు ఉంటే ఏడు రోజులలోపు తెలియజేయాలని తణుకు మున్సిపల్ కమిషనర్ టి.రామ్ కుమార్ తెలిపారు. మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయా వార్డుల్లో రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరారు.