RCB స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఆ జట్టు కెప్టెన్ రజత్ పటీదార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనను కెప్టెన్గా నియమించినప్పుడు తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలిపాడు. ఆ సమయంలో తనను కోహ్లీ వెన్నుతట్టి ప్రోత్సహించి, తనకు ఎంతో మద్దతుగా నిలిచినట్లు పేర్కొన్నాడు. ‘నువ్వు కెప్టెన్సీకి అర్హుడివి. నువ్వు దీన్ని సాధించుకున్నావు’ అని తనకు ధైర్యం చెప్పినట్లు వెల్లడించాడు.