SRD: ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులకు హెచ్చరించారు. కొండాపూర్ మండలం తొగర్ పల్లి గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోకుండా టార్పాలిన్ కవర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.