SKLM: పలాస మండలం కంరిగాం గ్రామ సమీప జాతీయ రహదారి బ్రిడ్జ్ సర్వీస్ రోడ్లో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పలాస కిడ్నీ ఆసుపత్రిలో డయాలసిస్ చేసుకుని తిరిగి వస్తున్న బాలకృష్ణ అనే వ్యక్తిని గుర్తు తెలియని బొలెరో వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలకృష్ణ ఎడమకాలు నుజ్జునుజ్జయింది. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.