ELR: జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలో శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మండల అధికారులతో కలిసి గ్రామస్తులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామంలోని సమస్యలను, ప్రజల సమస్యలను ఎమ్మెల్యే నేరుగా గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అలాగే వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.