NTR: విస్సన్నపేటలోని గిరిజన గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమాధికారి విజయశాంతి తెలిపారు. 3 నుంచి 9వ తరగతి వరకు అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నామని, విద్యార్థులు ఈ నెల 20లోపు విస్సన్నపేటలోని గిరిజన గురుకులంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.