సత్యసాయి: పరిగి మండలం గొర్రెపల్లి ప్రీకాట్ సూపర్ స్పిన్నింగ్ మిల్లు వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ.. గత దశాబ్దాలుగా ఎంతో మందికి ప్రీకాట్ మిల్లు ఉపాధి కల్పిస్తుందన్నారు. మంత్రి సవిత నిర్లక్ష్యం వల్ల ప్రీకాట్ మిల్లు ఇతర రాష్ట్రాలకు తరలి వెళుతుందన్నారు. దీంతో ఉపాధి లేక వందలాది కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉందన్నారు.