ELR: నూజివీడు ప్రొఫెషన్ మరియు ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయం పరిధిలో శనివారం స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఎక్సైజ్ సీఐ ఏ.మస్తానయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలన్నారు. మండుతున్న వేసవి నేపథ్యంలో పక్షులకు తాగునీటిని అందించారు.