యువతకు గ్రంథాలయాల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామని నగర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఉపేందర్ రెడ్డి అన్నారు. గన్ ఫౌండ్రీలోని గ్రంథాలయంలో చదివి జూనియర్ టెక్నికల్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించిన అభిషేక్ కుమార్‌ను చిక్కడపల్లి గ్రంథాలయంలో నేడు ఆయన ఘనంగా సన్మాంచారు. అభిషేక్‌ను ఆదర్శంగా తీసుకొని యువత ఉద్యోగాలు సాధించాలని సూచించారు.