JGL: భూ భారతి చట్టం పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో రెవెన్యూ సదస్సును రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం ప్రారంభించారు. కొద్ది సేపటి క్రితమే బుగ్గారం చేరుకొని ఈ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ , జగిత్యాల ఎమ్మెల్యే పాల్గొన్నారు.