HYD: నగర GHMC బల్దియాకు చెందిన పబ్లిక్ డిపాజిట్ ఖాతాలోని రూ.2,000 కోట్లను ప్రభుత్వం ఉపయోగించుకోవడంతో ఖాతాలో డబ్బు ఒక్కసారిగా ఖాళీ అయింది. దీంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న GHMCకి స్టాంపు డ్యూటీ నిధులు రావడంతో ఉపశమనం లభించింది. కానీ.. ప్రస్తుతం ప్రభుత్వం పీడీ రూ.2000 కోట్లు ఖాతాలోకి వెనక్కి తీసుకుంది.