ELR: ఆపరేషన్ సింథూర్తో పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేసి విజయం సాధించిన తరుణంలో భారత త్రివిధ దళాలకు, భారత ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాలకు సంఘీభావం ప్రకటిస్తూ.. శనివారం భీమవరంలో తిరంగా యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. అనంతరం రాజకీయాలకతీతంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ చేపట్టారు.