ELR: చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జి సీహెచ్ మధుబాబు శనివారం స్థానిక సబ్ జైలును సందర్శించారు. సబ్ జైల్లో ఉన్న నిందితుల కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సబ్ జైల్లో నిందితులకు అందిస్తున్న ఆహార పదార్థాలు తాగునీటిపై ఆరా తీశారు. నిందితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముద్దాయిలు ఉచిత న్యాయ సహాయాన్ని పొందవచ్చునని ఈ సందర్భంగా జడ్జి తెలిపారు.