KMM: సరస్వతి పుష్కరాల్లో భాగంగా శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి కాలేశ్వరం వద్ద ఉన్న నదిలో స్నానం ఆచరించారు. అనంతరం మంత్రి తుమ్మల, ఎంపీ రఘురాంరెడ్డి ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి, ఎంపీ పేర్కొన్నారు.