SBI డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. అన్ని కాలపరిమితుల డిపాజిట్లపై 20 బేసిక్ పాయింట్ల మేర తగ్గిస్తూ ప్రకటన చేసింది. ఇవాళ్టి నుంచే కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వస్తాయని SBI తెలిపింది. 1-2 సంవత్సరాల కంటే తక్కువ 6.70%, 3-5 సంవత్సరాల కంటే తక్కువ 6.75%, 444 రోజుల ప్రత్యేక డిపాజిట్ 6.85%, సీనియర్ సిటిజన్లకు అన్ని కాలపరిమితులపై అదనంగా 0.50% తగ్గింపు ఉండనుంది.