HYD: నగరంలో అతిపెద్ద పూల మార్కెట్ గుడిమల్కాపూర్ మార్కెట్. కానీ..ఇక్కడ ఇరుకైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ట్రాఫిక్ జామ్ సమస్య మరింత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో మార్కెట్ నగర శివారుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. పూలు,పండ్లు, కూరగాయల అన్నిటికి వేదికగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం 150 ఎకరాల స్థలం అవసరం ఉందని, అంచనా వేసి అధికారులు భూముల లభ్యత పరిశీలిస్తున్నారు.