ఎన్టీఆర్: కొండపల్లి ఐడీఏల్ హెచ్పీసీఎల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతన రూ. 26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు.