KDP: ప్రొద్దుటూరు టీడీపీ నాయకులపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి పగ ఎందుకని టీడీపీ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. మీరు అధికారంలో ఉన్నప్పుడు తనపై కేసులు పెట్టి అక్రమంగా జైళ్లో పెట్టారని అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ పగ తీర్చుకునే చర్యలు చేపట్టలేదని తెలిపారు.