నెల్లూరు: బారాషహీద్ దర్గాలో ఆదివారం రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. దేశవిదేశాల నుంచి భక్తులు కోరికల రొట్టెల కోసం తరలివస్తున్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ పండుగలో భక్తులు స్వర్ణాల చెరువులో స్నానమాచరిస్తున్నారు. ప్రభుత్వం తాగునీరు, టెంట్లు, ఉచిత భోజనం ఏర్పాటు చేసింది. కలెక్టర్, ఎస్పీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.