KDP: పోరుమామిళ్ల మండలం కమ్మవారిపల్లెకి చెందిన యువతి సత్యసాయి జిల్లా తుమ్మలవారిపల్లెకు చెందిన భాను ప్రకాశ్‌ను 7 నెలల క్రితం వివాహం చేసుకుంది. అతను హైదరాబాదులో AR కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు నమ్మించి మోసం చేసి వివాహం చేసుకున్నాడని యువతి తెలిపింది. అంతే కాకుండా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని శనివారం పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.