ప్రకాశం: పామూరులో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమాన్ని టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ పామూరు పట్టణ మాజీ అధ్యక్షులు షేక్ కాజా రహమతుల్లా, పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి నొస్సాం నాగేంద్ర చారి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.