W.G: తొలి ఏకాదశి పురస్కరించుకొని ఆకివీడులోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక మాదివాడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదన గోపాల స్వామి, ఎస్ టర్నింగ్లోని శ్రీ కోదండ రామాలయంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు స్వామివార్లను దర్శించుకుని తరించారు.