NLR: ఉదయగిరి కరెంటు ఆఫీస్ వద్ద హైవే సమీపంలో ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని గేదె మృత్యువాత పడింది. మేత కోసం ఒక మందగా గేదెలు వెళుతుండగా అటువైపుగా వేగంగా వెళుతున్న వాహనం ఢీ కొట్టినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో గేదె అక్కడికక్కడే మృతి చెందింది. మూగజీవాల రైతులు హైవేలపై గేదెలను వదిలే క్రమంలో జాగ్రత్తలు పాటించాలని పలువురు సూచిస్తున్నారు.