SRD: సంగారెడ్డి బైపాస్ చౌరస్తాలో ఆదివారం చేపల ధరలకు రెక్కలొచ్చాయి. వివిధ రకాలైన చేపల విక్రయాలు ఊపందుకున్నాయి. వ్యాపారులు కిలో చేపలు రూ.300-400 వరకు విక్రయిస్తున్నారు. ప్రజలు ఉదయం 6 గంటల నుంచే చేపలు కొనడానికి వచ్చారు. దీంతో డిమాండ్ బాగా పెరిగిందని పలువురు అంటున్నారు.