MDK: బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని CRP సంతోష్ కుమార్ తెలిపారు. రేగోడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలో MEO గురునాథ్ ఆధ్వర్యంలో శుక్రవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఇంగ్లీష్ మీడియంలో బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం పథకాలను గురించి తల్లిదండ్రులకు వివరించారు. పిల్లలను బడిలో చేర్పించాలని ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు.