జనగామ: పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ భాగస్వామ్యంతో జనగామలోని కలెక్టరేట్లో 35 మంది పంచాయతీ కార్యదర్శులకు సమాచార హక్కు, గ్రామసభ సామర్థ్య నిర్మాణంపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. గ్రామ పంచాయతీ స్థాయిలో పారదర్శకతను ప్రోత్సహించడం, సమాచార హక్కు చట్టం-2005, కార్యదర్శుల పాత్ర, సమాచార హక్కు వంటి అంశాలపై వివరించారు.