AP: నూజివీడు కోర్టులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ విచారణ ముగిసింది. బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఆయనను కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఈ కేసులో ఇరువైపుల న్యాయవాదులు గంటపాటు వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయాధికారి, కాసేపట్లో తీర్పు వెలువరించే అవకాశం ఉంది.