TPT: దొరవారిసత్రం మండల పరిషత్ సమావేశం హాల్లో శుక్రవారం ఎంపీపీ దువ్వూరు సుజాతమ్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం రసాభసగా జరిగింది. ఈ సందర్భంగా మండలంలో వ్యవసాయం, వైద్యం, ఆరోగ్యం, విద్య, మంచినీటి సరఫరా, పారిశుధ్యం మొదలగు అన్ని శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామంలో తాగునీరు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీపీ తెలిపారు.