కృష్ణా: మచిలీపట్నంలో జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎస్.శర్మిష్ట ర్యాలీని ప్రారంభించారు. జిల్లా కార్యాలయం నుంచి పరాశపేట సెంటర్ వరకు సాగిన ర్యాలీలో డెంగీ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యమని శర్మిష్ట పేర్కొన్నారు.