BPT: జిల్లా పోలీస్ శాఖకు ముగ్గురు దాతలు అందించిన మూడు డ్రోన్లను జిల్లా ఎస్పీ తుషార్ డూడి శుక్రవారం స్వీకరించి వారిని ఘనంగా సన్మానించారు. డ్రోన్లు పోలీస్ యంత్రాంగానికి బలాన్నిస్తాయని, చట్టవ్యతిరేక కార్యకలాపాలను నిరోధించేందుకు, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు వీటిని వినియోగిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. దాతల విరాళానికి కృతజ్ఞతలు తెలిపారు