KDP: కులం లేదు, మతం లేదు మనుషులంతా ఒకటే, అందరికీ దైవం ఒక్కడేనని జామియా నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ సంస్థ చైర్మన్ ఖారీ అబ్దుల్ సుభాన్ అన్నారు. శుక్రవారం ఒంటిమిట్ట మండలం మలకాటపల్లి గ్రామ సమీపంలో ఉన్న నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు ఆర్థిక సహాయాన్ని అందించారు. దానం చేసే గుణం ప్రతి ఒక్కరూ అవలంబించుకోవాలని సంస్థ చైర్మన్ అన్నారు.