PLD: పిడుగురాళ్ల మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు శుక్రవారం విస్తృత దాడులు నిర్వహించారు. మొత్తం 66 కేసులు నమోదు కాగా, వీటిలో DT కేసులు 22కి రూ.44,000, అదనపు లోడ్ 32కి రూ.1.26 లక్షలు, మాల్ ప్రాక్టీస్ 8కి రూ.24,000గా మొత్తం రూ.2.94 లక్షలు జరిమానాగా విధించారు. ఈ దాడుల్లో మాచర్ల డివిజన్ E.E. ఎన్. సింగయ్య పాల్గొన్నారు.