HYD: జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ఈ రోజు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్ నివాసం నుండి శివాజీ చౌక్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డెంగ్యూ జ్వరం దోమల ద్వారా వ్యాపించే వైరల్ వ్యాధి అని, దీని నివారణకు ప్రజల్లో అవగాహన పెంపొందించడం ముఖ్యమని తెలిపారు. ఇంటి పరిసరాల్లో పులా కుండీలో నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు.