CTR: చిత్తూరు ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి సమస్యలపై వినతులు స్వీకరించారు. మేయర్ అముదా, కమిషనర్ నరసింహ ప్రసాద్ బాధితుల నుంచి సమస్యలపై అర్జీలు తీసుకున్నారు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల మరమ్మత్తు తదితర 24 సమస్యలపై ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.