కొత్తగూడెం: బుధవారం భద్రాచలం రామాలయ దర్శనానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ హరినాథ్ని భద్రాచలం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోటా దేవదానం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించి వినతిపత్రం సమర్పించారు. పలు సమస్యలను న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు.