KNR: ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని తెలిపారు. విలీనం, కార్మిక సంఘాల అంశాలు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని, దీనిపై ఓ కమిటీ పని చేస్తోందని, ఉద్యోగులు సమస్యలు చెప్పుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.