MNCL: ఉపాధ్యాయులతోనే సమాజంలో చైతన్యం సాధ్యమని కాంగ్రెస్ దండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ అన్నారు. తాళ్ల పేట పాఠశాలలో పనిచేస్తూ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డును స్వీకరించిన రామరాజును మంగళవారం శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాళ్లపేట్ మాజీ సర్పంచ్ అడై కాంతారావు, సీనియర్ నాయకులు మంత్రి దేవయ్య, తాజీం, యువ నాయకులు సల్లూ భాయ్ ఉన్నారు.